- తిప్పాపూర్‌లో లబ్ధిదారులకు అండగా ప్రజాప్రతినిధులు
భిక్కనూరు, జూలై 13 (నవజ్యోతి ప్రతినిధి):
బిక్కనూరు మండలం తిప్పాపూర్ గ్రామంలో ఇటీవల ప్రభుత్వం గుడిసెల్లో నివసిస్తున్న 13 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేయగా, వారిలో ముగ్గురు లబ్ధిదారులు సోమవారం ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఇంటి స్థలంలో ముగ్గు పోసి, కొబ్బరికాయ కొట్టి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుంట లింగారెడ్డి, మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భీమ్‌రెడ్డి, ఉప సర్పంచ్ జీవన్, మాజీ సర్పంచ్ పైడి సాయిరెడ్డి, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు ధర్మయ్య, మహేష్, పాలకవర్గ సభ్యులు పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసుకుని సొంత ఇంటి కలను సాకారం చేసుకోవాలని సూచించారు.

