📄 ePaper
Monday, September 28, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఇస్కాబావిగూడెం లో మహా అన్నప్రసాద వితరణ!

ఇస్కాబావిగూడెం లో మహా అన్నప్రసాద వితరణ!

అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కోటిరెడ్డి, నల్లమోతు సిద్ధార్థ…

మాడుగులపల్లి, సెప్టెంబర్ 20 (నవజ్యోతి ప్రతినిధి):

 

మండల పరిధిలోని ఇస్కాబావిగూడెం గ్రామంలో విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ, బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పాలుట్ల బాబయ్య–సునీత దంపతుల ఆధ్వర్యంలో మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

 

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ ఎం.సీ. కోటిరెడ్డి, బీఆర్‌ఎస్ యువ నాయకుడు నల్లమోతు సిద్ధార్థ హాజరై విఘ్నేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భజన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు మహా అన్నప్రసాదాన్ని వితరణ చేశారు.

కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ జేరిపోతుల రాములు గౌడ్, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు నిమ్మల నవీన్‌రెడ్డి, మాజీ సర్పంచ్ నిమ్మల గోవిందమ్మ, ఎం.డీ. షోయబ్, సీత్యతండా సర్పంచ్ రాయరపు ఉమారాణి–వెంకన్న, ఉపసర్పంచ్ సంధ్య–చంద్రశేఖర్, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి కట్టా అనంతరెడ్డి, నన్నేబోయిన చంటి, నకిరేకంటి రాబట్టు, రాచూరి సతీష్, సీతారామరెడ్డి, నాగిరెడ్డి, బిక్షం, తంగెళ్ల శ్యాంసుందర్‌రెడ్డి, ఎల్లారెడ్డి, కందిమళ్ల విక్రమ్‌రెడ్డి, వంశీ, కుర్ర వెంకట్‌రెడ్డి, అఖిల్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!