భిక్కనూర్, ఆగస్టు 31 (నవజ్యోతి ప్రతినిధి ):
బిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామ అభివృద్ధికి ఎంపీ నిధులు మంజూరు చేయాలని కోరుతూ గ్రామ సర్పంచ్ పాలమాకుల జ్యోతి సంతోష్‌గౌడ్, ఉపసర్పంచ్ బైండ్ల దశరథం, వార్డు సభ్యులు అమృత, రావు రేణుక, సిద్ధరాములు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లింగం ఆధ్వర్యంలో పార్లమెంట్ సభ్యుడు సురేష్‌కుమార్ షెట్కర్‌కు వినతిపత్రం అందజేశారు.
గ్రామంలో పోస్టాఫీసు భవనం, అంగన్‌వాడీ భవనం, యువత కోసం ఓపెన్ జిమ్, గ్రంథాలయ భవనం ఏర్పాటుకు ఎంపీ నిధుల నుంచి నిధులు మంజూరు చేయాలని వారు కోరారు.
తక్షణమే స్పందించిన ఎంపీ పోస్ట్ ఆఫీస్ భవనానికి, ఓపెన్ జిమ్ కి నిధులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. దీనిపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు

