📄 ePaper
Thursday, August 6, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఆయుష్ శాఖలో కీలక మార్పులు..!

ఆయుష్ శాఖలో కీలక మార్పులు..!

డైరెక్టర్ అదనపు బాధ్యతల నుంచి శ్రీకాంత్ బాబు తప్పింపు.. ఐశా మస్రత్ ఖానమ్‌కు బాధ్యతలు

 

హైదరాబాద్, ఆగస్టు 5 (నవజ్యోతి ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్ శాఖలో కీలక పరిపాలనా మార్పులు చేపట్టింది. ఆయుష్ డైరెక్టర్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) నిర్వహిస్తున్న ప్రొఫెసర్ పి. శ్రీకాంత్ బాబును ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ, ఆయన స్థానంలో ఆరోగ్య, వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ ఐశా మస్రత్ ఖానమ్‌ను నియమించింది.

ప్రస్తుతం సివిల్ సప్లైస్ శాఖ జాయింట్ సెక్రటరీ (FAC)గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న ఐశా మస్రత్ ఖానమ్ ఇకపై తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయుష్ డైరెక్టర్ పూర్తి అదనపు బాధ్యతలను కూడా నిర్వహించనున్నారు.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలన (ఎస్‌పీఎల్-ఏ) శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశాల మేరకు ఈ నియామకాలు అమల్లోకి వచ్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!