📄 ePaper
Monday, August 10, 2026
📄 ePaper

అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి

బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి

రామాయంపేట,ఆగస్టు 9 (నవజ్యోతి ప్రతినిధి రాజాగౌడ్) :

మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో,సుభిక్షంగా ఉండాలని మెదక్ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి
కంఠారెడ్డి తిరుపతిరెడ్డి ఆకాంక్షించారు. రామాయంపేట పట్టణంలో ఆదివారం శ్రీ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు.ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల వేడుకల్లో కంఠారెడ్డి తిరుపతిరెడ్డి పాల్గొని శ్రీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, ఉత్సవ కమిటీ సభ్యులు ఆయనకు స్వాగతం పలికారు.ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి మాట్లాడుతూ బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. తరతరాలుగా కొనసాగుతున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
మహంకాళి అమ్మవారి కృపతో ప్రజల జీవితాల్లో ఆనందం, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని కోరుకున్నట్లు తెలిపారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.

ఉత్సవ కమిటీకి అభినందనలు

బోనాల ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించిన ఉత్సవ కమిటీ సభ్యులను తిరుపతిరెడ్డి అభినందించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో రామాయంపేట పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది.అనంతరం ఆలయ అర్చకులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు, మహిళలు, యువత, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!