రామాయంపేట లో ఘనంగా మహంకాళి అమ్మవారి బోనాలు.
మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి
రామాయంపేట,ఆగస్టు 9 (నవజ్యోతి ప్రతినిధి రాజాగౌడ్) :

రామాయంపేట మండల కేంద్రంలో శ్రీ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలను ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆషాఢ మాసం సందర్భంగా నిర్వహించిన ఈ ఉత్సవాల్లో పట్టణ ప్రజలు, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బోనాలు ఎత్తుకుని అమ్మవారి ఆలయానికి చేరుకుని భక్తిశ్రద్ధలతో సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.బోనాల ఉత్సవాల సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిశాయి.అమ్మవారి నామస్మరణలు, డప్పు చప్పుళ్లతో రామాయంపేటలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు
బోనాల ఉత్సవాల్లో మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి పాల్గొని శ్రీ మహంకాళి మాతను దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, అర్చకులు, భక్తులు ఆమెకు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బోనాల ఉత్సవాలను ప్రజలు భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా నిర్వహించుకుంటున్నారని తెలిపారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. తరతరాలుగా కొనసాగుతున్న ఆధ్యాత్మిక సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రజలందరిపై అమ్మవారి కృప ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ బాదే చంద్రం, మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, కౌన్సిలర్లు మద్దెల మాధవి, కొక్కు ప్రవీణ్, బీఆర్ఎస్ నాయకులు ఉమామహేశ్వర్, కన్నాపురం కృష్ణగౌడ్, నవత్ మహేష్, హస్నోద్దిన్, సర్వేయర్ బాలు, రొయ్యల నవీన్, దోమకొండ శ్రీనివాస్, పాతూరి సాయి తదితరులు పాల్గొన్నారు.

