📄 ePaper
Friday, September 11, 2026
📄 ePaper
Homeమెదక్వాల్మీకి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి

వాల్మీకి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి

ఆలయ అభివృద్ధికి సహకరిస్తాం.. వాల్మీకి మహర్షి గొప్ప పురుషుడు : మైనంపల్లి హనుమంతరావు

రామాయంపేట,సెప్టెంబర్ 7 (నవజ్యోతి ప్రతినిధి రాజాగౌడ్):

రామాయంపేట మండలం ఆర్‌.వెంకటాపూర్ గ్రామంలో శ్రీశ్రీశ్రీ వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ.. వాల్మీకి మహర్షి రామాయణ మహాకావ్యాన్ని రచించిన మహనీయుడని, ఆయన బోధనలు సమాజానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు.

ఆలయ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.గ్రామంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా యువతలో ఆధ్యాత్మిక, నైతిక విలువలు పెంపొందుతాయని ఆయన పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధికి అవసరమైన సహకారం అందించేందుకు ముందుంటానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉమా సంజీవరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బండారు మహేందర్‌రెడ్డి, పాలకవర్గ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు శ్రీధర్‌రెడ్డి, బండారి కిషన్, భీమ యాదగిరి, సర్పంచులు సునీల్, రవి, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.వాల్మీకి సంఘం నాయకులు హెచ్‌.ఎల్లం అధ్యక్షుడు, కే.స్వామి ఉపాధ్యక్షుడు, పడమటి రాజు, హెచ్‌.స్వామి,ఎస్‌.ధనరాజ్, హెచ్‌.నర్సింలు, కే.నర్సింలు, సుతారి శ్రీనివాస్ వైస్‌ప్రెసిడెంట్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!