📄 ePaper
Monday, September 28, 2026
📄 ePaper
Homeమెదక్బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన రాష్ట్ర నాయకులు కంఠరెడ్డి తిరుపతిరెడ్డి.

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన రాష్ట్ర నాయకులు కంఠరెడ్డి తిరుపతిరెడ్డి.

రామాయంపేట,ఆగస్టు 5 ( నవజ్యోతి ప్రతినిధి రాజాగౌడ్ ) : 

రామాయంపేట మండలం వెంకటాపూర్ (ఆర్) గ్రామానికి చెందిన రాచపల్లి బాబు మృతిచెందిన విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంఠ తిరుపతి రెడ్డి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ మృతుడి కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. బుధవారం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ఈ కష్టకాలంలో పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బీ.రాజిరెడ్డి, గ్రామ అధ్యక్షుడు తాడే సునీల్ (2వ వార్డు సభ్యుడు), జగదీష్, కొమ్మగల్ల బాబు, బండారి రాజు, కొమ్మగాళ్ల ప్రవీణ్, బండారి నవీన్, పుర్ర మనోహర్, పుర్ర వంశీ తిరుపతి,ఎల్లం (వార్డు సభ్యుడు),రాచపల్లి నాగరాజు, సత్యనారాయణ,స్వామి తదితరులు పాల్గొని మృతుడికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!