ఆపదలో అండగా నిలిచిన సంఘసేవకుడు వెంకుగారి రాజిరెడ్డి
రామాయంపేట, ఆగస్టు 5 ( నవజ్యోతి ప్రతినిధి రాజాగౌడ్) :
మెదక్ జిల్లా రామాయంపేట మండలం వెంకటాపూర్ (ఆర్) గ్రామానికి చెందిన రాచపల్లి బాబు అనారోగ్యంతో మంగళవారం మృతిచెందిన విషయం తెలిసి గ్రామానికి చెందిన ప్రముఖ సంఘసేవకుడు వెంకుగారి రాజిరెడ్డి బుధవారం మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ తన వంతు బాధ్యతగా రూ.5,000 నగదు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.కష్టకాలంలో కుటుంబానికి తోడుగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని రాజిరెడ్డి పేర్కొన్నారు. ఆయన అందించిన ఆర్థిక సాయం పట్ల మృతుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాచపల్లి సురేష్, రాచపల్లి ఎల్లం, కీసరి రాజాగౌడ్,రాచపల్లి రాజు,రాచపల్లి దుర్గయ్య,పుర్ర స్వామి, కొమ్మగళ్ళ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

