📄 ePaper
Thursday, August 13, 2026
📄 ePaper
HomeతెలంగాణKamareddy38, 39 వార్డుల్లో ముమ్మరంగా ఎస్‌ఐఆర్ కార్యక్రమం

38, 39 వార్డుల్లో ముమ్మరంగా ఎస్‌ఐఆర్ కార్యక్రమం

 

  • వంద శాతం విజయవంతం చేయాలని ఇప్ప శ్రీనివాస్ పిలుపు..

 

కామారెడ్డి, జూలై 12 (నవజ్యోతి ప్రతినిధి):

కామారెడ్డి పట్టణంలోని 38, 39వ వార్డుల్లో ప్రత్యేక ఓటరు సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు పకడ్బందీగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. స్థానిక ప్రభుత్వ ఉద్యోగులు, బీఎల్‌వోలు, వార్డు అధికారులు ఇంటింటికీ వెళ్లి దరఖాస్తు ఫారాలను సేకరిస్తూ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఇప్ప శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో వార్డు ప్రజలందరూ చురుకుగా పాల్గొని, అవసరమైన దరఖాస్తులను సమర్పించి కార్యక్రమాన్ని వంద శాతం విజయవంతం చేయాలని కోరారు. స్థానిక సిబ్బందికి పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్, బీజేపీ ఫ్లోర్ లీడర్ మోటూరి శ్రీకాంత్, బీఎల్‌వోలు స్నేహలత, భార్గవి, మనోజ్, వార్డు అధికారులు అమీర్, వంశీ, సురేష్ తదితరులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!