శస్త్రచికిత్స అనంతరం ఇంద్రకరణ్ రెడ్డిని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు
- ఎస్‌ఐఆర్ ఓటరు సవరణ కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించాలని బీఎల్‌ఏలకు సూచించాలి…
భిక్కనూరు, జూలై 12 (నవజ్యోతి ప్రతినిధి):
టీపీసీసీ కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి రెండు మోకాళ్లకు శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్న నేపథ్యంలో ఆదివారం తన సొంత గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న ఎస్‌ఐఆర్ ఓటరు సవరణ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో సమర్థవంతంగా నిర్వహించేలా బీఎల్‌ఏలు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఓటరు వివరాలు సక్రమంగా నమోదు అయ్యేలా పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పెద్ద మల్లారెడ్డి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాగా రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, స్వామి, అనిల్, పెద్ద మల్లారెడ్డి గ్రామ ఉపసర్పంచ్ చైతన్య రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

