📄 ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
Homeసంగారెడ్డిఘనంగా నీట్ పేపర్ లీక్ ఘటనపై కాంగ్రెస్ విజయోత్సవ ర్యాలీ

ఘనంగా నీట్ పేపర్ లీక్ ఘటనపై కాంగ్రెస్ విజయోత్సవ ర్యాలీ

 

సంగారెడ్డి, జూలై 26 (నవజ్యోతి న్యూస్):

నీట్ పేపర్ లీక్ ఘటనపై విద్యార్థులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పోరాటాన్ని విజయవంతంగా భావిస్తూ, సంగారెడ్డి పట్టణంలో శనివారం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఘన విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ, నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో విద్యార్థులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిరంతరం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పోరాటం సాగించిందని పేర్కొన్నారు.

ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన, విద్యార్థి, మహిళా విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పార్టీ జెండాలు చేతబట్టి నినాదాలు చేస్తూ పట్టణ ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు.

విద్యా వ్యవస్థలో పారదర్శకత నెలకొల్పాలని, పరీక్షల నిర్వహణలో అక్రమాలకు తావులేకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!