📄 ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
Homeతెలంగాణరంగారెడ్డిమేడ్చల్ నూతన ఎస్‌హెచ్‌ఓ అంజి రెడ్డికి శుభాకాంక్షల వెల్లువ

మేడ్చల్ నూతన ఎస్‌హెచ్‌ఓ అంజి రెడ్డికి శుభాకాంక్షల వెల్లువ

 

మేడ్చల్, జులై 25 (నవజ్యోతి ప్రతినిధి టి రాజగోపాల్) :

మేడ్చల్ పోలీస్ స్టేషన్ నూతన స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్‌హెచ్‌ఓ గా బాధ్యతలు స్వీకరించిన అంజి రెడ్డిని శనివారం పలువురు ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మేడ్చల్‌కు చెందిన వీర్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, ఆదర్శ్ రెడ్డి, అలాగే చింతల్‌కు చెందిన కిమిడి తిరుపతి నాయుడు, దేగల రాము నూతన ఎస్‌హెచ్‌ఓను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా నూతన ఎస్‌హెచ్‌ఓ అంజి రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమర్థవంతమైన పోలీసు సేవలు అందిస్తానని చెప్పారు. నియోజకవర్గంలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేస్తామని, ప్రజల నమ్మకానికి, విశ్వాసానికి అనుగుణంగా ఉత్తమ సేవలందించేందుకు నిరంతరం కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!