📄 ePaper
Wednesday, September 30, 2026
📄 ePaper
HomeతెలంగాణKamareddyకన్నుల పండుగగా కొనసాగిన తిరంగా ర్యాలీ !

కన్నుల పండుగగా కొనసాగిన తిరంగా ర్యాలీ !

త్రివర్ణ పతాకాలతో కదం తొక్కిన ప్రజలు.. దేశభక్తి నినాదాలతో మార్మోగిన పురవీధులు

కామారెడ్డి, ఆగస్టు 13 (నవజ్యోతి ప్రతినిధి):

దేశభక్తి, జాతీయ ఐక్యతను చాటుతూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం ఘనంగా
తిరంగా ర్యాలీ నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు
కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి నాయకత్వంలో గాంధీగంజ్‌ నుంచి ర్యాలీ ప్రారంభమైంది.

త్రివర్ణ పతాకాలతో కదం తొక్కిన ప్రజలు

 

త్రివర్ణ పతాకాలు చేతబూని పెద్ద సంఖ్యలో ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు. గాంధీగంజ్‌ నుంచి
జేపీఎన్‌ రోడ్‌, సుభాష్‌ రోడ్‌, తిలక్‌ రోడ్‌, సిరిసిల్ల రోడ్‌, స్టేషన్‌ రోడ్‌, కమాన్‌ మీదుగా
నిజాంసాగర్‌ చౌరస్తా వరకు ర్యాలీ సాగింది. మార్గమంతా జాతీయ జెండాలతో
పట్టణం త్రివర్ణ శోభను సంతరించుకుంది. దేశభక్తి నినాదాలతో పురవీధులు మార్మోగాయి.

వ్యాపారులు, యువకులు, మహిళలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ జెండాలను
చేతబూని ఉత్సాహంగా ర్యాలీలో ముందుకు సాగారు.

ర్యాలీ సందర్భంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
ప్రధాన రహదారుల మీదుగా ర్యాలీ సాగడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు
ప్రత్యేక చర్యలు చేపట్టారు.

జాతీయ ఐక్యతే లక్ష్యంగా..

వందేమాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకోనున్న సందర్భంగా,
80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఈ ర్యాలీ నిర్వహించినట్లు
నిర్వాహకులు తెలిపారు. దేశభక్తి స్ఫూర్తిని పెంపొందించడం, జాతీయ ఐక్యతను చాటడం,
యువతలో దేశంపై మరింత అవగాహన కల్పించడమే ర్యాలీ ఉద్దేశమని పేర్కొన్నారు.

జనగణమనతో ముగింపు: నిజాంసాగర్‌ చౌరస్తాకు చేరుకున్న అనంతరం
జాతీయ గీతం ‘జనగణమన’ ఆలాపనతో ర్యాలీ ముగిసింది.

భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొనడంతో తిరంగా ర్యాలీ కన్నుల పండుగగా సాగింది.
త్రివర్ణ పతాకాలతో అలంకరించిన రహదారులు, దేశభక్తి నినాదాలతో కామారెడ్డి పట్టణంలో
పండుగ వాతావరణం నెలకొంది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!