📄 ePaper
Monday, September 28, 2026
📄 ePaper
Homeమెదక్రామాయంపేటలో కొత్త పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేయాలి – బీజేపీ డిమాండ్

రామాయంపేటలో కొత్త పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేయాలి – బీజేపీ డిమాండ్

ఎస్‌ఐఆర్‌ లో వెలుగుచూసిన సమస్యల పరిష్కారానికి తహసీల్దార్ కి వినతిపత్రం

బూత్‌లు 76, 77తో పాటు వెంకటాపూర్(ఆర్) బూత్-115ను రేషనలైజేషన్ చేయాలని విజ్ఞప్తి

పోలింగ్ సమయంలో ఓటర్ల ఇబ్బందులు తొలగించేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్

రామాయంపేట, జూలై 29 (నవజ్యోతి ప్రతినిధి రాజాగౌడ్ ):

మెదక్ జిల్లా రామాయంపేట పట్టణం,మండలంలో పెరుగుతున్న ఓటర్ల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని కొత్త పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది.ఇటీవల నిర్వహించిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో గుర్తించిన సమస్యల ఆధారంగా రామాయంపేట మున్సిపాలిటీలోని బూత్ నంబర్లు 76, 77తో పాటు రామాయంపేట మండలంలోని వెంకటాపూర్ (ఆర్) గ్రామం బూత్ నంబర్ 115ను రేషనలైజేషన్ చేసి అదనపు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతూ రామాయంపేట ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించారు.

బీజేపీ నాయకులు తెలిపిన వివరాల ప్రకారం,రామాయంపేట మున్సిపాలిటీలోని బూత్ నంబర్లు 76, 77 పరిధిలో సుమారు 1,300 మంది ఓటర్లు నమోదై ఉన్నారు.ఒకే బూత్‌కు అధిక సంఖ్యలో ఓటర్లు ఉండటంతో ప్రతి ఎన్నికల సమయంలో భారీ రద్దీ నెలకొంటోందని,పోలింగ్ కేంద్రాల్లో తగిన వసతులు లేకపోవడం వల్ల వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఓటింగ్ ప్రక్రియ పూర్తి కావడానికి ఎక్కువ సమయం పట్టడం వల్ల ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారని, అందువల్ల ఈ బూత్‌లను విభజించి కొత్త పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా రామాయంపేట మండలంలోని వెంకటాపూర్ (ఆర్) గ్రామంలో ప్రస్తుతం బూత్ నంబర్ 115 ఒక్కటే ఉండటంతో గ్రామ ప్రజలందరూ ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటు వేయాల్సిన పరిస్థితి నెలకొన్నదని తెలిపారు. దీంతో ప్రతి ఎన్నికల సమయంలో భారీ రద్దీ ఏర్పడి ఓటర్లకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, గ్రామ జనాభా, ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా అదనపు పోలింగ్ బూత్‌ను వెంటనే మంజూరు చేయాలని కోరారు.

ఈ మేరకు రామాయంపేట పట్టణ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, మండల ప్రధాన కార్యదర్శి దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో రామాయంపేట ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శంకర్ గౌడ్, అక్కన్నపేట సర్పంచ్ యాదగిరి, దంతపల్లి సర్పంచ్ బాలరాజ్, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల శేఖర్, ఓబీసీ మోర్చా జిల్లా నాయకులు నవత్ రాజేంద్రప్రసాద్, మండల ప్రభారి రంజిత్ రెడ్డి, పట్టణ ప్రభారి గడ్డం కాశీనాథ్, అక్కన్నపేట మాజీ సర్పంచ్ వెలుముల సిద్ధరాములు, పట్టణ సీనియర్ నాయకులు రమణ, బీజేవైఎం మండల అధ్యక్షుడు కన్నయ్య, నాయకులు నాగరాజు, వెంకటి, నితిన్, సంతోష్, బాసం అనిల్ తదితరులు పాల్గొన్నారు.ప్రజలకు సౌకర్యవంతమైన, పారదర్శకమైన ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన ప్రాంతాల్లో కొత్త పోలింగ్ బూత్‌ల ఏర్పాటు విషయంలో ఎన్నికల సంఘం తక్షణమే సానుకూల నిర్ణయం తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ ఈ సందర్భంగా డిమాండ్ చేసింది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!