లంబాడీల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు అశోక్ నాయక్ డిమాండ్
సంగారెడ్డి, ఆగస్టు 12 (నవజ్యోతి ప్రతినిధి):
రాష్ట్రంలో లంబాడీ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో తగిన ప్రాధాన్యం కల్పించి, మంత్రి పదవి కేటాయించాలని లంబాడీల ఐక్య వేదిక సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు అశోక్ నాయక్ డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఐక్య వేదిక కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రభుత్వాల ఏర్పాటులో లంబాడీలు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ రాజకీయంగా సముచిత ప్రాతినిధ్యం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి లంబాడీ సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధికి మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని కోరారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో బి. తారాసింగ్ నాయక్, కవిరాం రాథోడ్, ప్రకాష్ నాయక్, కమల్‌సింగ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

