📄 ePaper
Wednesday, September 30, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కేసీఆర్‌ బావమరిది జోగినపల్లి శ్రీనివాసరావు మృతి !

కేసీఆర్‌ బావమరిది జోగినపల్లి శ్రీనివాసరావు మృతి !

హైదరాబాద్‌, ఆగస్టు 13 (నవజ్యోతి ప్రతినిధి):

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ బావమరిది జోగినపల్లి శ్రీనివాసరావు మృతి చెందారు.

 వయోభారం మరియు అనారోగ్యంతో ఈరోజు ఉదయం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో కన్నుమూశారు.భౌతికకాయాన్ని సుచిత్రలోని ఆయన నివాసానికి తరలించారు.


ఆయన మృతితో కేసీఆర్‌ కుటుంబంలో విషాదం నెలకొంది.

కుటుంబ అనుబంధం:
శ్రీనివాసరావు.. కేసీఆర్‌ సతీమణి శోభకు ఏకైక సోదరుడు. కేటీఆర్‌కు మేనమామ.
కుటుంబ కార్యక్రమాల్లో కేసీఆర్‌ కుటుంబంతో సన్నిహితంగా ఉండేవారు.

కామారెడ్డి ఎన్నికల్లో కీలకంగా..

2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ కామారెడ్డి నుంచి పోటీ చేసిన సమయంలో
శ్రీనివాసరావు అక్కడ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

సంతాపం:
శ్రీనివాసరావు మృతిపై బీఆర్‌ఎస్‌ శ్రేణులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!