📄 ePaper
Thursday, August 13, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్మెదక్‌ జిల్లా వార్డు మెంబర్ల ఫోరం అధ్యక్షుడిగా గాంతి అశోక్‌ !

మెదక్‌ జిల్లా వార్డు మెంబర్ల ఫోరం అధ్యక్షుడిగా గాంతి అశోక్‌ !

పరికిబండలో కాంగ్రెస్‌ నాయకుల ఘన సన్మానం

మనోహరాబాద్‌, ఆగస్టు 12 (నవజ్యోతి ప్రతినిధి):
మెదక్‌ జిల్లా వార్డు మెంబర్ల ఫోరం అధ్యక్షుడిగా ఎన్నికైన మనోహరాబాద్‌ మండలం పరికిబండ గ్రామ ఆరో వార్డు సభ్యుడు గాంతి అశోక్‌ను పరికిబండ, గౌతోజీగూడెం, పోతారం గ్రామాల కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు గాంతి అశోక్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా స్థాయిలో వార్డు మెంబర్ల ఫోరం అధ్యక్షుడిగా ఎన్నిక కావడం పరికిబండ గ్రామానికి గర్వకారణమని పేర్కొన్నారు. వార్డు సభ్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.

ఘనంగా సన్మానం

అశోక్‌ ఎన్నికతో వార్డు సభ్యుల సమస్యలను జిల్లా స్థాయిలో సమర్థవంతంగా ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేయాలని నాయకులు కోరారు. ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు తెలిపి భవిష్యత్‌లో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో గౌతోజీగూడెం సర్పంచ్‌ నాగరాజు, ఉపసర్పంచ్‌ ఎర్ర నాగరాజు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పుట్ట మహేందర్‌, మంచ శ్రీరామ్‌, యెషం భగవాన్‌, నిమ్మల యాదగిరి, కర్కాల సత్యనారాయణరెడ్డి, నిమ్మల శ్రీశైలం, బొల్లాబోయిన నర్సింలు, చింతల ఆనంద్‌, గోనెగరి నవీన్‌గౌడ్‌, గండి మహేష్‌, తూముకుంట శ్రీశైలం, గాంతి క్రాంతికుమార్‌, సాలిపేట నాగరాజు, సురేష్‌, బాబు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!