📄 ePaper
Friday, August 7, 2026
📄 ePaper
Homeమెదక్మెదక్ బీజేపీ ధార్మిక సెల్ నూతన కమిటీ సభ్యుల నియామకం.

మెదక్ బీజేపీ ధార్మిక సెల్ నూతన కమిటీ సభ్యుల నియామకం.

దేవాలయాల రక్షణ, అభివృద్ధికి నిరంతర పోరాటం చేస్తాం: వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్

‘ధర్మో రక్షతి రక్షితః’ నినాదంతో ముందుకు సాగుదాం.

రామాయంపేట జూలై 2 (నవజ్యోతి ప్రతినిధి రాజాగౌడ్ ) :

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ధార్మిక సెల్ ఆధ్వర్యంలో దేవాలయాల పరిరక్షణ, అభివృద్ధి, హిందూ ధార్మిక సంప్రదాయాల పరిరక్షణ లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా కమిటీలను ఏర్పాటు చేసినట్లు నాయకులు తెలిపారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు నూతనంగా నియమితులైన ధార్మిక సెల్ జిల్లా కమిటీ సభ్యులు గురువారం బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ, దేవాలయాలు కేవలం ఆరాధనా కేంద్రాలు మాత్రమే కాకుండా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని అన్నారు. దేవాలయాలపై ఎలాంటి దాడులు, ఆక్రమణలు, అవమానకర వ్యాఖ్యలు జరిగినా భారతీయ జనతా పార్టీ ధార్మిక సెల్ తక్షణమే స్పందించి చట్టబద్ధంగా పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.రాష్ట్ర ధార్మిక సెల్ స్టేట్ జాయింట్ కన్వీనర్ కవితా రెడ్డి, జిల్లా కన్వీనర్ తాళ్ళ విజయ్ గౌడ్, జిల్లా కో-కన్వీనర్లు ప్రసాద్ రెడ్డి, నరేందర్ రెడ్డి, జిల్లా జాయింట్ కన్వీనర్లు నవీన్, కృష్ణ తదితరులు జిల్లా అధ్యక్షుడితో సమావేశమై జిల్లాలోని దేవాలయాల పరిస్థితి, ఎదురవుతున్న సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.మెదక్ జిల్లాలోని ప్రతి దేవాలయాన్ని పరిరక్షించేందుకు, ఆలయాల పరిశుభ్రత, అభివృద్ధి, ఆక్రమణల నివారణ, భక్తుల సౌకర్యాల కల్పన వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కమిటీకి సూచించారు. ఆలయాల భూములను పరిరక్షించడం, దేవాలయాల గౌరవాన్ని కాపాడడం, ధార్మిక విలువలను ప్రజల్లో పెంపొందించడం కోసం నిరంతరం పనిచేయాలని కోరారు.దేవాలయాలకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా శాఖ ప్రజలతో కలిసి పోరాటం చేస్తుందని, ధార్మిక సెల్‌కు పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా నాయకులు “దేవాలయాలను నిర్మించుకుందాం.. దేవాలయాలను పరిశుభ్రంగా కాపాడుకుందాం.. ధర్మో రక్షతి రక్షితః” అనే నినాదంతో ప్రతి హిందువు ఆలయ పరిరక్షణలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!