జూలై 22న ముఖాముఖి ఎంపిక.. 21లోగా దరఖాస్తులు సమర్పించాలని సూచన
కామారెడ్డి, జూలై 19 (నవజ్యోతి ప్రతినిధి):
కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను వివిధ విభాగాల్లో 24 అతిథి అధ్యాపక (గెస్ట్ ఫ్యాకల్టీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ కె. విజయ్ కుమార్ తెలిపారు.
సంబంధిత విభాగాల్లో స్నాతకోత్తర విద్యార్హత కలిగిన అభ్యర్థులు జూలై 21 సాయంత్రం 4 గంటలలోపు తమ దరఖాస్తులను కళాశాల కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జూలై 22 ఉదయం 10 గంటలకు కళాశాల ప్రాంగణంలో ముఖాముఖి ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రధానాచార్యులు కోరారు.

