📄 ePaper
Saturday, August 8, 2026
📄 ePaper
HomeతెలంగాణGHMCసాయిబాబా నగర్ సమస్యలపై వినోద్ కుమార్ చొరవ

సాయిబాబా నగర్ సమస్యలపై వినోద్ కుమార్ చొరవ

కుత్బుల్లాపూర్, జూలై 19: (నవజ్యోతి ప్రతినిధి)

62 నుంచి 65 బ్లాక్‌ల ప్రజల ఇబ్బందులకు పరిష్కార మార్గంసాయిబాబా నగర్ 292 డివిజన్ పరిధిలోని ఆర్‌జీకే కాలనీలో 62వ బ్లాక్ నుంచి 65వ బ్లాక్ వరకు నెలకొన్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సమస్యతో పాటు మంజీరా తాగునీటి సరఫరా సమస్యపై స్థానికులు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వారాల వినోద్ కుమార్‌ను కలిసి తమ ఇబ్బందులను వివరించారు.

స్థానికుల ఫిర్యాదుపై వెంటనే స్పందించిన వారాల వినోద్ కుమార్ సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి సమస్య తీవ్రతను వివరించారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ఆలస్యం చేయకుండా చర్యలు చేపట్టాలని కోరారు. దీనిపై అధికారులు సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే వరకు అధికారులతో నిరంతరం సమన్వయం కొనసాగిస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో రాజ్‌కుమార్ ముదిరాజ్, జై సింహారెడ్డి, జహీర్, నరసింహ గౌడ్‌తో పాటు స్థానిక అపార్ట్‌మెంట్ వాసులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సమస్యల పరిష్కారం కోరారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!