తూప్రాన్, 26 జులై (నవజ్యోతి ప్రతినిది నవీన్ ):
తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మండల పార్టీ అధ్యక్షులు ఉమ్మన్నగారి భాస్కర్ రెడ్డి మాతృమూర్తి రాజమణి శుక్రవారం మృతి చెందిన విషయం రాష్ట్ర నాయకులు చిట్కూల మహిపాల్ రెడ్డి ద్వారా తెలుసుకున్న మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదివారం భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులను వారి నివాసంలో పరామర్శించి తల్లీ రాజమణి చిత్రపటానికి పూలమాలవేసి మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు, కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఆయన వారి తల్లి నీ కోల్పోయిన తీరని దుఃఖంలో ఉన్న కుటుంబానికి ఆ భగవంతుడు కొండంత మనోధైర్యాన్ని కల్పించాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు,ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్,రాష్ట్ర నాయకులు చిట్కుల మహిపాల్ రెడ్డి, ఉమ్మడి మండలాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

