📄 ePaper
Tuesday, September 29, 2026
📄 ePaper
Homeమెదక్రామాయంపేట న్యూ సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయానికి స్వంత భవనం.. 20 గుంటల స్థలం కేటాయింపు.

రామాయంపేట న్యూ సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయానికి స్వంత భవనం.. 20 గుంటల స్థలం కేటాయింపు.

ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సహకారంతో ప్రక్రియ పూర్తి : మున్సిపల్ ఛైర్పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు.

రామాయంపేట, జులై 17 ( నవజ్యోతి ప్రతినిధి రాజాగౌడ్ ) : 

రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో ఎన్నో సంవత్సరాలుగా సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయం స్వంత భవనం లేక కిరాయి భవనంలో కొనసాగుతున్న నేపథ్యంలో, కార్యాలయానికి శాశ్వత భవనం నిర్మించేందుకు కీలక ముందడుగు పడింది. సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయ నిర్మాణం కోసం తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న 20 గుంటల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించారు.ఈ స్థల కేటాయింపు ప్రక్రియ మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సహకారంతో చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. తహసీల్దార్ రజని కుమారి, మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు సంయుక్తంగా స్థలాన్ని పరిశీలించి కేటాయింపు ప్రక్రియను పూర్తి చేశారు.

సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయానికి స్వంత భవనం నిర్మాణం పూర్తయితే ప్రజలకు మెరుగైన మౌలిక వసతులతో వేగవంతమైన, సౌకర్యవంతమైన రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న భవన సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

ఈ కార్యక్రమంలో సబ్‌ రిజిస్ట్రార్, మున్సిపల్ కౌన్సిలర్లు,కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!