📄 ePaper
Monday, August 10, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్మాచారెడ్డి అభివృద్ధిపై షబ్బీర్ అలీతో సర్పంచుల భేటీ

మాచారెడ్డి అభివృద్ధిపై షబ్బీర్ అలీతో సర్పంచుల భేటీ

  • మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా సంతోష్ రెడ్డి…

హైదరాబాద్, జూలై 17 (నవజ్యోతి ప్రతినిధి):

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని శుక్రవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మాచారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాచారెడ్డి గ్రామ సర్పంచ్ సంతోష్ రెడ్డిని మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడంపై షబ్బీర్ అలీ అభినందనలు తెలుపుతూ, బాధ్యతలను విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.

అనంతరం మండలానికి సంబంధించిన పలు అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలను సర్పంచులు ఆయన దృష్టికి తీసుకెళ్లగా, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని షబ్బీర్ అలీ ఆదేశించారు. ప్రజాప్రతినిధులు ప్రజలతో మమేకమై గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

 

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగ్ రావు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నౌసిలాల్‌తో పాటు పలువురు సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!