భిక్కనూర్, జూలై 13 (నవజ్యోతి ప్రతినిధి):
భిక్కనూరు మండలం రామేశ్వర్ పల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జాతీయ నులిపురుగు నిర్మూలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆల్బెండాజోల్ మాత్రలను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి గారు పంపిణీ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిన్నారులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఎదగడానికి నులిపురుగుల నివారణ ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి ఆరోగ్య స్పృహతో తప్పనిసరిగా ఆల్బెండాజోల్ మాత్రలను తీసుకోవాలని, తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ జి. వినోద్ గౌడ్, భిక్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ ఏమిమా దేవి, వీడీసీ అధ్యక్షులు మద్ది సూర్యకాంత్ రెడ్డి, వీడీసీ కార్యదర్శి నాగర్తి చిన్న భూంరెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు ఉమారాణి, విశాల, హెచ్.ఈ.ఓ. వెంకట రమణ, ఏఎన్‌ఎం మాధవి, సతీష్, ఆశా కార్యకర్తలు, అంగన్ వాడి టీచర్లు, విద్యార్థులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

