📄 ePaper
Tuesday, September 29, 2026
📄 ePaper
Homeమెదక్ధర్మారంలో (SIR) డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించిన తహశీల్దార్ రజనీకుమారి

ధర్మారంలో (SIR) డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించిన తహశీల్దార్ రజనీకుమారి

రామాయంపేట జూలై 5 ( నవజ్యోతి ప్రతినిధి రాజాగౌడ్ ) :

రామాయంపేట మండలం ధర్మారం గ్రామంలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను తహశీల్దార్ రజనీకుమారి ఆదివారం పరిశీలించారు.ఈ సందర్భంగా బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు), బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) నిర్వహిస్తున్న పనులను తనిఖీ చేసి, ప్రతి ఓటరు ఎన్యుమరేషన్ ఫారాన్ని పూర్తిగా నింపేలా అవగాహన కల్పించాలని సూచించారు. పూర్తయిన ఫారాలను ఎలాంటి పొరపాట్లు లేకుండా వెంటనే డిజిటలైజ్ చేసి,నిర్ణీత గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.

ఓటరు జాబితాలో తప్పులు,లోపాలు లేకుండా అర్హులైన ప్రతి ఓటరు పేరు నమోదు అయ్యేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకంగా,వేగవంతంగా సవరణ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!