📄 ePaper
Monday, August 10, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కాట్రియాల్‌ గ్రామంలో సమగ్ర ఓటరు జాబితా సవరణకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు.

కాట్రియాల్‌ గ్రామంలో సమగ్ర ఓటరు జాబితా సవరణకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు.

రామాయంపేట జూలై 5 ( నవజ్యోతి ప్రతినిధి రాజాగౌడ్ ) : 

రామాయంపేట మండలం కాట్రియాల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. గ్రామస్థులు తమ ఓటరు వివరాలను సులభంగా నమోదు చేసుకునేలా, సవరణలు చేసుకునేలా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.ఈ సందర్భంగా బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) గ్రామస్థుల నుంచి ఎన్యుమరేషన్ ఫారాలను స్వీకరించి,కొత్త ఓటర్ల నమోదు, పేర్లు, చిరునామా, వయస్సు తదితర వివరాల సవరణ ప్రక్రియను నిర్వహిస్తున్నారు.అర్హులైన ప్రతి ఓటరు వివరాలు ఖచ్చితంగా నమోదు అయ్యేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సవరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులు చర్యలు చేపట్టారు. గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ఓటరు వివరాలను పరిశీలించి,అవసరమైన మార్పులు ఉంటే వెంటనే నమోదు చేసుకోవాలని సూచించారు.100 శాతం సమగ్ర ఓటరు జాబితా సవరణ లక్ష్యంగా అధికారులు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!