📄 ePaper
Monday, August 10, 2026
📄 ePaper
Homeమెదక్సమగ్ర ఓటరు జాబితా సవరణకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు

సమగ్ర ఓటరు జాబితా సవరణకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు

బీఎల్వోలు, బీఎల్‌ఏల ఆధ్వర్యంలో ఎన్యుమరేషన్ ఫారాల స్వీకరణ.

ఓటర్లకు అవగాహన కల్పించిన కాంగ్రెస్ నాయకులు

రామాయంపేట జూలై 6 ( నవజ్యోతి ప్రతినిధి రాజాగౌడ్ ) : 

రామాయంపేట మండలం కాట్రియాల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. సర్పంచ్ కొత్త స్రవంతి రాజేందర్ గుప్తా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీఎల్వోలు, బీఎల్‌ఏలు ఎన్యుమరేషన్ ఫారాలను స్వీకరిస్తూ కొత్త ఓటర్ల నమోదు, పేరు, చిరునామా, వయస్సు, ఇతర వివరాల సవరణ ప్రక్రియను చేపట్టారు. అర్హులైన ప్రతి ఓటరు తమ వివరాలను సకాలంలో నమోదు చేసుకుని సరిచేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు గడిల నగేష్, సర్పంచ్ కొత్త స్రవంతి రాజేందర్ గుప్తా, ఉపసర్పంచ్ బాబు, కాట్రియాల్ సిద్దరాములు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఎల్వోలు, బీఎల్‌ఏలు పాల్గొని ఓటర్లకు అవసరమైన సహాయ సహకారాలు అందించారు.

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!