గ్రామ సమస్యలపై ప్రభుత్వ సలహాదారుతో చర్చ..
హైదరాబాద్, ఆగస్టు 3 (నవజ్యోతి ప్రతినిధి):
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామానికి సంబంధించిన పలు సమస్యలు, అభివృద్ధి అవసరాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
పెద్దమల్లారెడ్డి గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు ప్రజలకు సంబంధించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు. గ్రామాభివృద్ధికి ప్రభుత్వం సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో భిక్కనూరు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ స్వామి, శ్రీనివాస్, రవి, అనిల్, గణేష్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

