తూప్రాన్‌లో వరుస చోరీలతో ప్రజల్లో ఆందోళన
తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని పోతరాజ్‌పల్లి సమీపంలోని హనుమాన్ వెంచర్‌లో ఉన్న రేణుక ఎల్లమ్మ ఆలయంలో గుర్తుతెలియని దుండగులు హుండీ పగలగొట్టి నగదు ఎత్తుకెళ్లారు. ఆలయ కమిటీ సభ్యులు గత నెల 28న సమావేశం అనంతరం ఆలయానికి తాళం వేసి వెళ్లగా, ఆదివారం ఉదయం ఆలయ తాళాలు పగులగొట్టి హుండీని ధ్వంసం చేసినట్లు గుర్తించారు.
ఈ ఘటనపై ఆలయ కమిటీ సభ్యుడు గొలుసుల నర్సిములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తూప్రాన్ ఎస్‌ఐ గంగరాజు తెలిపారు. నిందితులను గుర్తించేందుకు పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.
వరుస చోరీలతో భయాందోళ
ఇటీవల తూప్రాన్ పరిధిలో వరుసగా చోరీలు జరుగుతుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో పోలీసు పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేసి దొంగతనాలను అరికట్టాలని వారు పోలీసులను కోరుతున్నారు.

