📄 ePaper
Wednesday, August 5, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్సేఫ్టీతో 'ఛాలెంజ్‌' చేస్తున్న మద్యం బ్రాండ్లపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కొరడా !

సేఫ్టీతో ‘ఛాలెంజ్‌’ చేస్తున్న మద్యం బ్రాండ్లపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కొరడా !

పలు ప్రముఖ బ్రాండ్ల విక్రయాలపై నిషేధం.. కృత్రిమ ఫ్లేవరింగ్‌పై అభ్యంతరం

దేశంలోని ప్రముఖ మద్యం బ్రాండ్లపై భారత ఆహార భద్రతా, ప్రమాణాల సంస్థ (FSSAI) కొరడా ఝళిపించింది. నిబంధనలకు విరుద్ధంగా కృత్రిమ లేదా “నేచర్ ఐడెంటికల్” ఫ్లేవరింగ్ పదార్థాలను ఉపయోగించినట్లు గుర్తించి కొన్ని ప్రముఖ బ్రాండ్ల విక్రయాలను నిషేధించింది.

ప్రభావితమైన ప్రముఖ బ్రాండ్లు

ఈ చర్యల ప్రభావం రాయల్ ఛాలెంజ్ విస్కీ, ఆంటిక్విటీ బ్లూ విస్కీ, బ్యాగ్‌పైపర్ డీలక్స్ విస్కీ, మెక్‌డోవెల్స్ నం.1 రమ్తో పాటు ఓల్డ్ మాంక్కు చెందిన కొన్ని వేరియంట్లపై పడింది. సంబంధిత తయారీ యూనిట్లలో తయారైన ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేయాలని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆదేశించింది.

ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అభ్యంతరం

విస్కీ, రమ్ తయారీలో సహజ పరిపక్వత ద్వారా రావాల్సిన రుచి, వాసనను కృత్రిమ ఫ్లేవర్లతో సృష్టించడం ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధమని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పేర్కొంది. దీంతో ఆయా ఉత్పత్తులను “సబ్‌స్టాండర్డ్”గా పరిగణిస్తూ చర్యలు తీసుకుంది.

కోర్టును ఆశ్రయించిన సంస్థలు

ఈ నిర్ణయాన్ని సంబంధిత తయారీ సంస్థలు వ్యతిరేకించాయి. తమ ఉత్పత్తులు అమల్లో ఉన్న నిబంధనలకు అనుగుణంగానే తయారవుతున్నాయని పేర్కొంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ప్రస్తుతం ఈ వ్యవహారంపై కోర్టులో విచారణ కొనసాగుతోంది.

భారత్‌లో వేల కోట్ల రూపాయల విలువైన మద్యం మార్కెట్ ఉన్న నేపథ్యంలో ప్రముఖ బ్రాండ్లపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తీసుకున్న ఈ చర్య పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. భవిష్యత్తులో నాణ్యత ప్రమాణాల అమలుపై మరింత కఠిన నిఘా కొనసాగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!