📄 ePaper
Wednesday, August 19, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్బిక్కనూరులో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ !

బిక్కనూరులో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ !

విద్యాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట – ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

కామారెడ్డి జిల్లా బిక్కనూరు, ఆగస్టు 18 (నవజ్యోతి ప్రతినిధి):

కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘ్వాన్  పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బిక్నూర్ మండలంలోని బిక్కనూర్ టౌన్‌లో రూ.200 కోట్లతో నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసినట్లు తెలిపారు. పాఠశాల మంజూరుకు కృషి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్

తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ద్వారా G.O.Rt.No.145, తేదీ 04-08-2026 ద్వారా కామారెడ్డి జిల్లా, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ (YIIRS) కాంప్లెక్స్ భవన నిర్మాణానికి రూ.200.00 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేసిందని తెలిపారు.

విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు

ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ద్వారా విద్యార్థులకు ఒకే ప్రాంగణంలో నాణ్యమైన పాఠశాల విద్యతో పాటు ఆధునిక తరగతి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయం, క్రీడా సదుపాయాలు, వసతి, భోజనం మరియు ఇతర మౌలిక వసతులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని షబ్బీర్ అలీ తెలిపారు.

పేద మరియు ప్రతిభావంతులైన విద్యార్థులకు మెరుగైన విద్య అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఆర్థిక పరిస్థితులు విద్యార్థుల భవిష్యత్తుకు అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో విద్యారంగంలో భారీ పెట్టుబడులు పెడుతున్నామని తెలిపారు.

కామారెడ్డిని విద్యా హబ్‌గా తీర్చిదిద్దుతాం

కామారెడ్డిని విద్యా హబ్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంలో భాగంగా ఈ రూ.200 కోట్ల ప్రాజెక్టు మరో కీలక ముందడుగు అని షబ్బీర్ అలీ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో విద్యారంగాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.

భిక్కనూర్ నాయకుల కృతజ్ఞతలు

బిక్కనూర్ మండలంలోని బిక్కనూర్ టౌన్‌కు రూ.200 కోట్లతో నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి భిక్కనూర్ నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా బిక్కనూర్ ప్రాంతానికి ఇంతటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థ మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి కృతజ్ఞతలు తెలిపారు

ఈ కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఇంద్రకరణ్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, సర్పంచ్ రేఖ సుదర్శన్, భీమ్‌రెడ్డి, లింగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుదర్శన్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!