📄 ePaper
Wednesday, August 19, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్బిక్కనూరుకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ రాకపై నేతల హర్షం !

బిక్కనూరుకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ రాకపై నేతల హర్షం !

స్కూల్ మంజూరుకు కృషిచేసిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి శాలువాతో సన్మానం

కామారెడ్డి జిల్లా బిక్కనూర్, ఆగస్టు 19 (నవజ్యోతి ప్రతినిధి):
బిక్కనూర్ మండలంలోని బిక్కనూర్ టౌన్‌లో రూ.200 కోట్లతో నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు కావడంపై బిక్కనూర్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మీడియా సమావేశం నిర్వహించి ఈ విషయాన్ని వెల్లడించారు.

బిక్కనూర్‌లో రూ.200 కోట్లతో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ మంజూరు కావడానికి కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్‌కు బిక్కనూర్ నాయకులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీని శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.

విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు

రూ.200 కోట్లతో ఏర్పాటు కానున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ ద్వారా విద్యార్థులకు ఆధునిక విద్యా వసతులు, మెరుగైన తరగతి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయం, క్రీడా సదుపాయాలు, వసతి, భోజనం తదితర సౌకర్యాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని నాయకులు తెలిపారు. ఈ విద్యాసంస్థతో బిక్కనూర్ ప్రాంతంలో విద్యా అవకాశాలు మరింత మెరుగుపడతాయని పేర్కొన్నారు.

బిక్కనూర్ నాయకుల కృతజ్ఞతలు

బిక్కనూర్‌కు ఇంతటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థ మంజూరు చేయడం పట్ల నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రెటరీ బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, బిక్కనూర్ సర్పంచ్ రేఖ సుదర్శన్, పీఏసీఎస్ చైర్మన్ తిప్పాపూర్ భీమ్ రెడ్డి, కామారెడ్డి చైర్మన్ గూడెం శీను, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుదర్శన్, బిక్కనూర్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, తిప్పాపూర్ సర్పంచ్ కుంట లింగారెడ్డి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!