మనోహరబాద్, 17 ఆగష్టు ( నవజ్యోతి ప్రతినిధి నవీన్ ) : మెదక్ జిల్లా మనోహరాబాద్, చేగుంట మండలాల్లో రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి , మెదక్ ఎంపీ రఘునందన్ రావు లు సోమవారం పర్యటించారు. వారికి బీజేపీ, కాంగ్రెస్ ఇరు వర్గాల నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా కళ్లకల్‌లోని బంగారమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ముప్పిరెడ్డిపల్లి గ్రామంలోని శాంతా బయోలాజిక్స్‌లో మెదక్ జిల్లాలోని పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాల కోసం MESIC వెబ్‌సైట్‌ను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ప్రారంభించారు.కూచారం, చేగుంట గ్రామాల్లో 2 కేజీబివి పాఠశాల విద్యాలయాలను మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డితో కలిసి,మెదక్ మంత్రి వివేక్ వెంకట స్వామి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. యువత ఉద్యోగాలు సాధించేందుకు నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మారుతున్న ఉద్యోగ అవకాశాలకు అనుగుణంగా యువత తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు పెంపొందించుకోవాలని అన్నారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు కలిగిన యువతను తయారు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, చిట్కుల మహిపాల్ రెడ్డి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రశేఖర్, పలు గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్, బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు, కేజీబీవీ పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

