📄 ePaper
Sunday, October 4, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్'నా భర్తను యాక్సిడెంట్ చేసి చంపుతావా?..'

‘నా భర్తను యాక్సిడెంట్ చేసి చంపుతావా?..’

ప్రియుడితో ఇన్‌స్టాగ్రామ్ చాట్లలో హత్య కుట్ర ఆరోపణలు.. ప్రాణ రక్షణ కోరుతూ భర్త ఫిర్యాదు

మహబూబాబాద్, ఆగస్టు 7 (నవజ్యోతి ప్రతినిధి):

తనను రోడ్డు ప్రమాదంలా చిత్రీకరించి హత్య చేయాలని భార్య, ఆమె ప్రియుడు కుట్ర పన్నారని ఆరోపిస్తూ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలానికి చెందిన ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. ఇందుకు సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ చాట్ స్క్రీన్‌షాట్లు, ఇతర డిజిటల్ ఆధారాలను పోలీసులకు సమర్పించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఏమైందంటే..?

చిలుకోడు గ్రామానికి చెందిన గాదె రాజేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. 2016లో సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం రాఘవాపురానికి చెందిన భవానిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తాను ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్న సమయంలో భార్యకు ఖమ్మంలో కొరియర్ బాయ్‌గా పనిచేస్తున్న సైదులతో పరిచయం ఏర్పడి, అది ప్రేమ వ్యవహారంగా మారిందని ఆరోపించాడు.

చాట్లలో హత్య కుట్ర?

తాను ఇంట్లో లేని సమయంలో సైదులు తమ ఇంటికి వచ్చి వెళ్లేవాడని, తమ సంబంధానికి తాను అడ్డుగా ఉన్నానని భావించి తనను హత్య చేసేందుకు కుట్ర పన్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. “నా భర్తను యాక్సిడెంట్ చేసి చంపుతావా? లేదా?.. ఇంట్లో చనిపోతే నా మీదే అనుమానం వస్తుంది” అనే తరహాలో తన భార్య ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రియుడికి సందేశాలు పంపినట్లు ఆరోపించాడు.

పోలీసులకు డిజిటల్ ఆధారాలు

ఇన్‌స్టాగ్రామ్ చాట్ స్క్రీన్‌షాట్లు, సెల్‌ఫోన్ సందేశాలు, ఇతర డిజిటల్ ఆధారాలను పోలీసులకు అందజేసినట్లు రాజేశ్వరరావు తెలిపారు. తనకు, తన ఇద్దరు కుమార్తెలకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు.

దర్యాప్తు కొనసాగుతోంది

ఫిర్యాదు స్వీకరించిన డోర్నకల్ పోలీసులు సమర్పించిన ఆధారాలను పరిశీలిస్తూ అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ చాట్ సందేశాల ప్రామాణికత, ఫిర్యాదులోని ఆరోపణల నిజానిజాలు పోలీసు విచారణలో తేలాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!