📄 ePaper
Thursday, August 6, 2026
📄 ePaper
HomeArchitectureయూపీఐ చెల్లింపులపై ఛార్జీలకు మార్గం..!

యూపీఐ చెల్లింపులపై ఛార్జీలకు మార్గం..!

యూపీఐ చెల్లింపులపై ఛార్జీలకు మార్గం..!

లోక్‌సభలో బిల్లు ఆమోదం.. బ్యాంకులకు అధికారాల కల్పన.. చిన్న వ్యాపారుల్లో ఆందోళన

న్యూఢిల్లీ, ఆగస్టు 6 (నవజ్యోతి ప్రతినిధి): దేశవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగిస్తున్న యూపీఐ (UPI) డిజిటల్ చెల్లింపులపై భవిష్యత్తులో ఛార్జీలు విధించే అవకాశాలకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టం–2007కు సవరణ చేస్తూ తీసుకొచ్చిన బిల్లుకు లోక్‌సభ గురువారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లు రాజ్యసభలో కూడా ఆమోదం పొంది రాష్ట్రపతి ఆమోదం లభిస్తే, యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు (ఎండీఆర్) విధించేందుకు కేంద్ర ప్రభుత్వం బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు అనుమతి ఇచ్చే వీలు కలుగుతుంది.

ప్రస్తుతం యూపీఐ ద్వారా జరిగే చెల్లింపులపై వినియోగదారులు, వ్యాపారుల నుంచి ఎలాంటి ఎండీఆర్ వసూలు చేయడం లేదు. అయితే డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ నిర్వహణ, సాంకేతిక మౌలిక వసతుల వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో ఎండీఆర్‌కు చట్టబద్ధమైన అవకాశం కల్పించేందుకు ఈ సవరణ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే రూ.2,000కు పైబడిన యూపీఐ లావాదేవీలపై 0.3 నుంచి 0.5 శాతం వరకు ఎండీఆర్ విధించే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని సమాచారం. అయితే ఇది ఇంకా తుది నిర్ణయం కాదని, ఎవరిపై ఎంత భారం పడుతుందనే అంశంపై ప్రభుత్వం, ఆర్‌బీఐ, సంబంధిత వర్గాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.

నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎండీఆర్ అమల్లోకి వస్తే పెద్ద వ్యాపార సంస్థలతో పోలిస్తే చిన్న కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులు ఎక్కువ ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంది. అదనపు ఖర్చును వినియోగదారులపై మోపడం లేదా చిన్న మొత్తాల యూపీఐ చెల్లింపులను నిరుత్సాహపరచడం జరిగే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. మరోవైపు బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థలకు మాత్రం డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను మరింత స్థిరంగా నిర్వహించేందుకు ఆదాయ వనరు లభిస్తుందని విశ్లేషిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!