📄 ePaper
Friday, August 7, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్'ప్యారడైజ్' టీజర్‌తో పూనకాలే..!

‘ప్యారడైజ్’ టీజర్‌తో పూనకాలే..!

95 సెకన్లలోనే నాని మాస్ విశ్వరూపం..!

హైదరాబాద్, ఆగస్టు 6 (నవజ్యోతి ప్రతినిధి):

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఒడేల కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ది ప్యారడైజ్’ టీజర్ విడుదలై సినీ అభిమానులను ఆకట్టుకుంటోంది. కేవలం 95 సెకన్ల నిడివిలోనే రా యాక్షన్, డార్క్ విజువల్స్, ఎమోషన్, భారీ మేకింగ్‌తో చిత్రబృందం సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

టీజర్‌లో నాని ఇప్పటివరకు కనిపించని రగ్గడ్ అవతార్‌లో కనిపించాడు. ఆయన బాడీ లాంగ్వేజ్, తీవ్రతతో కూడిన నటన, యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దర్శకుడు శ్రీకాంత్ ఒడేల విజువల్ టేకింగ్, సినిమాటోగ్రఫీ, అనిరుధ్ రవిచందర్ అందించిన నేపథ్య సంగీతం టీజర్‌కు మరింత బలం చేకూర్చాయని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కొద్దిసేపు ఉన్నప్పటికీ సీనియర్ తెలుగు విలక్షణ కథానాయకుడు మోహన్ బాబు విలనిజం టీజర్ లో ఆకట్టుకుంది.

సోషల్ మీడియాలో టీజర్ విడుదలైన వెంటనే ట్రెండింగ్‌లోకి వెళ్లింది. విజువల్స్, నాని మేకోవర్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతుండగా, కొందరు నెటిజన్లు డైలాగ్‌లు స్పష్టంగా వినిపించలేదని, కథకు సంబంధించిన సంకేతాలు మరింత ఉండాల్సిందని అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ మొత్తం మీద టీజర్ సినిమాపై భారీ హైప్‌ను తీసుకొచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

‘దసరా’ తర్వాత నాని–శ్రీకాంత్ ఒడేల కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్‌లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార గీతం మంచి స్పందన పొందగా, ఇప్పుడు టీజర్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

తెలుగు టీజర్

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!