📄 ePaper
Thursday, August 6, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ప్రేమ కోసం పోరాటం.. ఎమ్మెల్యే తండ్రిపైనే కుమారుడి సంచలన ఆరోపణలు..!

ప్రేమ కోసం పోరాటం.. ఎమ్మెల్యే తండ్రిపైనే కుమారుడి సంచలన ఆరోపణలు..!

నన్ను చంపే ప్రయత్నం చేస్తున్నారు’ అన్న ఎమ్మెల్యే కుమారుడు.. ‘అతడు నా కొడుకు కాదు’ అన్న ప్రకాష్ గౌడ్

 

హైదరాబాద్, ఆగస్టు 6 (నవజ్యోతి ప్రతినిధి):

రాజేంద్రనగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కుటుంబంలో ప్రేమ వివాహం వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది. తాను ప్రేమించిన యువతిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకోవడాన్ని తన తండ్రి వ్యతిరేకిస్తున్నారని ఎమ్మెల్యే కుమారుడు విలేకరుల సమావేశంలో సంచలన ఆరోపణలు చేశారు. తనకు సొంత తండ్రి నుంచే ప్రాణహాని ఉందని, తనను అంతమొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

తాను ప్రేమించిన యువతి ఇంటిపై తన తండ్రి అనుచరులతో దాడి చేయించారని, తమ ఇద్దరినీ, యువతి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఏ క్షణమైనా తమ ప్రాణాలకు ముప్పు ఉందని, వెంటనే తనకు, తనకు కాబోయే భార్యకు, ఆమె కుటుంబ సభ్యులకు పోలీసు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ స్పందిస్తూ, అతడు ఇకపై తన కొడుకు కాదని పేర్కొన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను తగిన సమయంలో ప్రజల ముందుంచుతానని తెలిపారు.

తండ్రి, కొడుకు పరస్పర వ్యాఖ్యలతో ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రేమ వివాహం చుట్టూ మొదలైన ఈ వివాదం ఇప్పుడు కుటుంబ విభేదాల నుంచి రాజకీయ చర్చ వరకు వెళ్లడం గమనార్హం. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసులు, అధికార వర్గాల స్పందన కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!