📄 ePaper
Monday, August 10, 2026
📄 ePaper

ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డికి గ్రామస్థుల కృతజ్ఞతలు…

భిక్నూర్‌, ఆగస్టు 9 (నవజ్యోతి ప్రతినిధి):

కామారెడ్డి నియోజకవర్గంలోని భిక్నూర్‌ మండలం తిప్పాపూర్‌ గ్రామపంచాయతీ పరిధిలో ప్రభుత్వ ఆస్పత్రి వద్ద సీసీ రోడ్డు పనులను బీజేపీ నాయకులు ప్రారంభించారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కేటాయించిన రూ.8 లక్షల నిధులతో ఆస్పత్రికి వెళ్లే రోడ్డుకు ఇరువైపులా పనులు చేపట్టారు.

ఎమ్మెల్యే దృష్టికి సమస్య

ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లే రోడ్డు అధ్వానంగా ఉండటంతో రోగులు, గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే నిధులు మంజూరు చేశారని తెలిపారు. దీంతో ఆస్పత్రికి వెళ్లే రహదారికి ఇరువైపులా సీసీ రోడ్డు పనులు ప్రారంభించినట్లు పేర్కొన్నారు.

గ్రామస్థుల కృతజ్ఞతలు

తిప్పాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లే రహదారి సమస్యను పరిష్కరించేందుకు రూ.8 లక్షలు కేటాయించిన ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డికి గ్రామస్థుల తరఫున బీజేపీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. రోడ్డు పనులు పూర్తయితే రోగులు, గ్రామస్థులకు రాకపోకల ఇబ్బందులు తొలగుతాయని పేర్కొన్నారు.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!