సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువ కావాలి: శ్రీరామ్ వెంకటేష్
భిక్కనూరు, ఆగస్టు 9 (నవజ్యోతి ప్రతినిధి):

యూత్ కాంగ్రెస్ 66వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని భిక్కనూరు మండల యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. మండలంలోని వివిధ గ్రామాల యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీరామ్ వెంకటేష్ మాట్లాడుతూ ఆవిర్భావ దినోత్సవాన్ని సేవా కార్యక్రమాలతో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలవడం, సేవా భావంతో పనిచేయడం ప్రతి యువజన కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత అన్నారు. పేదలు, రోగులు, ఆపదలో ఉన్న వారికి చేతనైన సాయం చేస్తూ ప్రజలకు మరింత చేరువ కావాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు జీవన్, కర్నల శ్రీను, చిరంజీవి, ప్రదీప్, శశి, వంశీ, కిషన్, గంగాధర్, షారూక్, చక్రపాణి, సోహెల్, అశోక్, స్వామి, శ్రీకాంత్, లోకేష్, నిఖిల్, ప్రణయ్, అభిషేక్, బాల ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

