- సీనియర్ నాయకుల ఫిర్యాదుతో డీసీసీ నిర్ణయం
భిక్కనూరు, జులై 26 (నవజ్యోతి ప్రతినిధి):
పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించిన భిక్కనూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు, 14వ వార్డు సభ్యుడిపై జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) సస్పెన్షన్ వేటు వేసింది. సీనియర్ కాంగ్రెస్ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దుర్భాషలాడిన ఘటనపై వచ్చిన ఫిర్యాదును డీసీసీ దృష్టికి తీసుకెళ్లగా, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు భిక్కనూరు మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నాగన్నగారి నరేందర్ రెడ్డి తెలిపారు. పార్టీ క్రమశిక్షణకు భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, పార్టీ ప్రతిష్ఠకు నష్టం కలిగించే వారిపై భవిష్యత్తులో కూడా కఠిన చర్యలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుదర్శన్, మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సీనియర్ ,కాంగ్రెస్ నాయకుడు భీమ్ రెడ్డి , యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీరామ్ వెంకటేష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు దయాకర్ రెడ్డి, మద్దూరి రవి తదితరులు పాల్గొన్నారు

