మాడుగులపల్లి, జులై 29 (నవజ్యోతి ప్రతినిధి) మాడుగులపల్లి మండల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన సురేష్ యాదవ్‌ను బుధవారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మందటి శ్రీధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందిస్తూ విజయవంతంగా విధులు నిర్వహించాలని ఆకాంక్షించారు.

