వేములపల్లి, ఆగస్టు 8 (నవజ్యోతి ప్రతినిధి): గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఓ వ్యవసాయ రైతు మృతి చెందిన ఘటన వేములపల్లి మండలంలో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. వేములపల్లి గ్రామానికి చెందిన చెరుకు సత్యనారాయణ వ్యక్తిగత పనుల నిమిత్తం బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా శెట్టిపాలెం అడ్డరోడ్డు వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సత్యనారాయణను మిర్యాలగూడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడి భార్య పారిజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

