📄 ePaper
Wednesday, August 5, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్తెలంగాణలో పోలీస్ కొలువుల జాతర..!

తెలంగాణలో పోలీస్ కొలువుల జాతర..!

  • ఒకేసారి 7,437 పోస్టులకు నాలుగు నోటిఫికేషన్లు • కానిస్టేబుల్ నుంచి ఎస్‌ఐ వరకు భారీ భర్తీ.
  • జిల్లా, జోన్ వారీగా ఖాళీలు

హైదరాబాద్, జూలై 29 ( నవజ్యోతి ఎడిటోరియల్ ):

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీజీపీఆర్‌బీ) ఒకేసారి నాలుగు నోటిఫికేషన్లు విడుదల చేసి మొత్తం 7,437 పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. పోలీస్ శాఖ, తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, అగ్నిమాపక శాఖ, జైళ్ల శాఖల్లో వివిధ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

ఈ నియామకాలలో అత్యధికంగా కానిస్టేబుల్ స్థాయి పోస్టులే ఉన్నాయి. వీటితో పాటు ఎస్‌ఐ, స్టేషన్ ఫైర్ ఆఫీసర్, డిప్యూటీ జైలర్, అసిస్టెంట్ సబ్‌ ఇన్‌స్పెక్టర్ (ఫింగర్ ప్రింట్ బ్యూరో), డ్రైవర్, మెకానిక్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. ఈ నియామకాలు తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో విడుదలైన అతిపెద్ద పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్లలో ఒకటిగా నిలిచాయి.

మొత్తం నోటిఫికేషన్లు

నోటిఫికేషన్ పోస్టులు
కానిస్టేబుల్ & సమాన పోస్టులు 7,112
సబ్ ఇన్‌స్పెక్టర్ & సమాన పోస్టులు 275
అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఫింగర్ ప్రింట్ బ్యూరో) 23
డ్రైవర్ & మెకానిక్ 27
మొత్తం పోస్టులు 7,437

కానిస్టేబుల్ పోస్టుల వివరాలు

పోస్టు ఖాళీలు
పోలీస్ కానిస్టేబుల్ (సివిల్) 3,697
పోలీస్ కానిస్టేబుల్ (ఏఆర్) 1,052
పోలీస్ కానిస్టేబుల్ (ఎస్‌ఏఆర్ సీపీఎల్) 24
తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ 1,380
ఫైర్ ఫైటర్ 751
వార్డర్ (పురుషులు) 196
వార్డర్ (మహిళలు) 12
పోలీస్ కానిస్టేబుల్ (డ్రైవర్) 20
పోలీస్ కానిస్టేబుల్ (మెకానిక్) 7

ఎస్‌ఐ & సమాన పోస్టులు

పోస్టు ఖాళీలు
ఎస్‌ఐ (సివిల్) 148
రిజర్వ్ ఎస్‌ఐ (ఏఆర్) 14
రిజర్వ్ ఎస్‌ఐ (టీజీఎస్‌పీ) 12
రిజర్వ్ ఎస్‌ఐ (ఎస్‌ఏఆర్ సీపీఎల్) 3
తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్‌ఐ 44
స్టేషన్ ఫైర్ ఆఫీసర్ 39
డిప్యూటీ జైలర్ (పురుషులు) 14
డిప్యూటీ జైలర్ (మహిళలు) 1
ఏఎస్‌ఐ (ఫింగర్ ప్రింట్ బ్యూరో) 23

ఎస్‌ఐ (సివిల్) జోన్ వారీ పోస్టులు

జోన్ పోస్టులు
కాలేశ్వరం 15
బాసర 29
రాజన్న 32
భద్రాద్రి 33
యాదాద్రి 22
చార్మినార్ 13
జోగులాంబ 4

స్టేషన్ ఫైర్ ఆఫీసర్ జోన్ వారీ పోస్టులు

జోన్ పోస్టులు
కాలేశ్వరం 4
బాసర 5
రాజన్న 7
భద్రాద్రి 3
యాదాద్రి 2
చార్మినార్ 13
జోగులాంబ 5

ఉద్యోగార్థులకు ముఖ్య సమాచారం

దరఖాస్తులను పూర్తిగా ఆన్‌లైన్‌లో మాత్రమే స్వీకరిస్తారు. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు ఒకేసారి పీఎంటీ, పీఈటీ నిర్వహించి అదే ఫలితాన్ని అన్ని పోస్టులకు వర్తింపజేస్తారు. కానిస్టేబుల్ పోస్టులకు ఇంటర్మీడియట్ లేదా సమాన అర్హత, ఎస్‌ఐ మరియు సమాన పోస్టులకు డిగ్రీ లేదా సంబంధిత విద్యార్హత తప్పనిసరి. వయోపరిమితి, శారీరక ప్రమాణాలు, రిజర్వేషన్లు, ఎంపిక విధానం వంటి పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో అందుబాటులో ఉన్నాయి.

హైలైట్స్

  • ✅ మొత్తం పోస్టులు : 7,437
  • ✅ కానిస్టేబుల్ పోస్టులు : 7,112
  • ✅ ఎస్‌ఐ & సమాన పోస్టులు : 275
  • ✅ ఏఎస్‌ఐ (ఎఫ్‌పీబీ) : 23
  • ✅ డ్రైవర్ & మెకానిక్ : 27
  • ✅ జిల్లా, జోన్ వారీగా పోస్టుల కేటాయింపు
  • ✅ ఆన్‌లైన్ దరఖాస్తులు
  • ✅ ఒకేసారి పీఎంటీ, పీఈటీ

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!