📄 ePaper
Sunday, November 1, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్వేటు ప్రచారం వేళ.. సీఎం రేవంత్‌కు కొండా సురేఖ రాఖీ!

వేటు ప్రచారం వేళ.. సీఎం రేవంత్‌కు కొండా సురేఖ రాఖీ!

కాంగ్రెస్‌లో సురేఖ వ్యవహారం హాట్‌టాపిక్‌.. ఇదే  సమయంలో కలిపిన రాఖీ బంధం ..

హైదరాబాద్, ఆగస్టు 28 (నవజ్యోతి ప్రతినిధి):
తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం రాజకీయంగా
ఉత్కంఠ రేపుతున్న వేళ.. రక్షాబంధన్‌ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.
మంత్రి సురేఖ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డికి రాఖీ కట్టి
పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి దనసరి సీతక్క కూడా
సీఎంకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

సీతక్క రక్షాబంధన్‌ సందర్భంగా రేవంత్‌రెడ్డికి రాఖీ కట్టడం సాధారణంగా కొనసాగుతున్న
సంప్రదాయమే. కొండా సురేఖ కూడా గత ఏడాది రక్షాబంధన్‌ సందర్భంగా సీఎంకు రాఖీ
కట్టారు. దీంతో ఈ ఏడాది కూడా రాఖీ కట్టడం కొత్త పరిణామం కాకపోయినా..
ప్రస్తుతం సురేఖ చుట్టూ నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ భేటీకి
ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది.

సురేఖపై చర్యల సిఫారసు.. ఏం జరుగుతుందో?

కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్‌లో
వివాదం తలెత్తింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆయన కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై
పార్టీ నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన
కాంగ్రెస్‌ క్రమశిక్షణ కమిటీ.. సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలని
సిఫారసు చేసినట్లు
ఇటీవల వార్తా కథనాలు వెలువడ్డాయి.

క్రమశిక్షణ కమిటీ సిఫారసుతో సురేఖ మంత్రి పదవిపై అనిశ్చితి నెలకొన్న సమయంలోనే
రక్షాబంధన్‌ వచ్చింది. దీంతో సీఎం రేవంత్‌రెడ్డిని సురేఖ కలిసి రాఖీ కట్టడం
రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

కొండా మురళికి సీనియర్‌ మంత్రుల సూచన?

మరోవైపు కొండా సురేఖ విషయంలో సీనియర్‌ కాంగ్రెస్‌ మంత్రులు
కొండా మురళిని కలిసి సురేఖతో మంత్రి పదవికి రాజీనామా చేయించాలని
సూచించినట్లు కూడా వార్తా కథనాలు వచ్చాయి. పార్టీ అధిష్ఠానం నుంచి కఠిన నిర్ణయం
వచ్చే పరిస్థితి కంటే ముందుగానే రాజీనామా చేయడం గౌరవప్రదంగా ఉంటుందని వారు
సూచించినట్లు ప్రచారం జరిగింది.

దీంతో ఒకవైపు క్రమశిక్షణ కమిటీ సిఫారసు, మరోవైపు సీనియర్‌ మంత్రుల సూచనలు,
ఇంకోవైపు అధిష్ఠానం తుది నిర్ణయం కోసం ఎదురుచూపులు కొనసాగుతున్నాయి.
ఇలాంటి సమయంలోనే సురేఖ సీఎం రేవంత్‌కు రాఖీ కట్టడం
రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.

రాజకీయ సంకేతమా.. పండుగ మర్యాద మాత్రమేనా?

సురేఖ రాఖీ కట్టడాన్ని ఆమెకు, సీఎంకు మధ్య రాజకీయ విభేదాలు సమసిపోయినట్లు
భావించాలా? లేక ప్రతిఏటా కొనసాగుతున్న రక్షాబంధన్‌ సంప్రదాయంలో భాగంగానే
చూడాలా? అన్న చర్చ మొదలైంది. అయితే రాఖీ వేడుకతో క్రమశిక్షణ కమిటీ
సిఫారసుపై నిర్ణయం మారిందని చెప్పడానికి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక
ప్రకటన లేదు.

మంత్రి కొండా సురేఖ కామెంట్స్

🔸 రేవంత్‌రెడ్డికి ప్రత్యేకంగా చేయించిన బంగారు రాఖీ కట్టిన కొండా సురేఖ

🔸 ప్రతి ఏడాది మాదిరే ఈ ఏడాది కూడా సీఎం రేవంత్‌రెడ్డికి రాఖీ కట్టాను.

🔸 సీఎం కోసం ప్రత్యేకంగా చేయించిన బంగారు రాఖీ కట్టాను.

🔸 సీఎం మనవడికి, అల్లుడికి కూడా రాఖీ కట్టా.

🔸 పండగ వాతావరణంలో నేను ఎలాంటి కామెంట్స్ చేయను.

— మంత్రి కొండా సురేఖ

 

ఒకవైపు రాజకీయ సంక్షోభం.. మరోవైపు రాఖీ బంధం!

కొండా సురేఖ మంత్రి పదవిపై చర్చలు కొనసాగుతున్న వేళ సీఎం రేవంత్‌రెడ్డికి
ఆమె రాఖీ కట్టడం తెలంగాణ కాంగ్రెస్‌లో ఆసక్తికర చర్చకు కారణమైంది.
అయితే ఈ వేడుకను రాజకీయ నిర్ణయానికి సంకేతంగా భావించాలా లేదా అన్నది
మాత్రం అధిష్ఠానం తదుపరి చర్యలతోనే స్పష్టమయ్యే అవకాశం ఉంది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!