📄 ePaper
Thursday, August 13, 2026
📄 ePaper
Homeమెదక్రామాయంపేటలో ప్రైవేట్ ల్యాబ్‌లపై డీఎంహెచ్‌వో ఆకస్మిక తనిఖీలు.

రామాయంపేటలో ప్రైవేట్ ల్యాబ్‌లపై డీఎంహెచ్‌వో ఆకస్మిక తనిఖీలు.

రామాయంపేట జూలై 3 ( నవజ్యోతి ప్రతినిధి రాజాగౌడ్ ) :

మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని పలు ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లు, ల్యాబ్‌లను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌వో) డా.గణేశ్వర్ సీహెచ్‌సీ సూపరింటెండెంట్ డా. లింబాద్రి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పట్టణంలోని షిఫా డయాగ్నస్టిక్ సెంటర్, యశస్వి డయాగ్నస్టిక్ సెంటర్, శ్రీ సాయి కృష్ణ నర్సింగ్ హోమ్ ల్యాబ్, విజయ డయాగ్నస్టిక్ సెంటర్, టెస్లా డయాగ్నస్టిక్ సెంటర్‌లను సందర్శించి అక్కడి నిర్వహణ, రోగుల నమోదు వివరాలు, లైసెన్సులు, ల్యాబ్ రికార్డులు, పరీక్షల నాణ్యత ప్రమాణాలు, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ, అలాగే ల్యాబ్ నివేదికల జారీ విధానాన్ని పరిశీలించారు.ఇటీవల కొన్ని ల్యాబ్ నివేదికలపై వచ్చిన ప్రతికూల వార్తలు, ఫిర్యాదుల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. ఈ సందర్భంగా నిబంధనలకు అనుగుణంగా సేవలు అందించాలని, ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు నిర్వాహకులకు సూచించారు. ల్యాబ్‌లలో రికార్డులు ఎప్పటికప్పుడు నవీకరించి ఉంచాలని, రోగులకు నాణ్యమైన సేవలు అందించడంలో నిర్లక్ష్యం చేయరాదని హెచ్చరించారు. నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.ఈ తనిఖీల్లో సీహెచ్‌సీ సూపరింటెండెంట్ డా.లింబాద్రి,ధర్మారం ఇన్‌చార్జి మెడికల్ ఆఫీసర్ డా.రవికుమార్, సీహెచ్‌వోలు కొండయ్య, బాల నరసయ్య, సూపర్‌వైజర్లు,పీహెచ్‌సీ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!