రామేశ్వర్ పల్లి గ్రామంలో తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణం ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం ప్రారంభం..

1
76

భిక్కనూరు (కామారెడ్డి జిల్లా), జూన్ 30 (నవజ్యోతి ప్రతినిధి)

కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణానికి చెందిన ఎన్.ఎస్.ఎస్ విభాగం ఐదు మరియు ఆరు ఆధ్వర్యంలో వారం రోజుల ప్రత్యేక శిబిరం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్  చేపూరి రాణి అధ్యక్షత వహించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, దక్షిణ ప్రాంగణ సంచాలకులు డాక్టర్ ఆర్. సుధాకర్ గౌడ్ హాజరై శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా  మద్ది చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ, ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం కామారెడ్డి డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ స్వచ్ఛంద సేవకులు గ్రామ అభివృద్ధికి చేసిన కృషిని గుర్తు చేశారు. గ్రామ అభివృద్ధి ప్రణాళికలను వివరించి, ప్రస్తుతం కూడా గ్రామ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తూ నూతన పథకాల అమలుకు కృషి చేయాలని సూచించారు. గ్రామంలో డిజిటల్ విలేజ్ ప్రక్రియ ప్రారంభం కావడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. రామేశ్వరపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్న ప్రాంగణ సంచాలకులు మరియు వారి సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.

అనంతరం ఎన్ఎస్ఎస్ స్వచ్ఛంద సేవకులు గ్రామంలో అవగాహన ప్రదర్శన నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ శిబిర సమన్వయకర్తలు డాక్టర్ అంజయ్య, డాక్టర్ హరిత, తెలంగాణ విశ్వవిద్యాలయ అధ్యాపకులు డాక్టర్ మోహన్ బాబు, డాక్టర్ టీ ప్రతిజ్ఞ, డాక్టర్ సబితా, డాక్టర్ ఎస్ నారాయణ గుప్తా, శ్రీకాంత్, ఉప సర్పంచ్ గొల్లపల్లి వినోద్ కుమార్ గౌడ్, వార్డు సభ్యులు శశి కుమార్, మద్ది కృష్ణారెడ్డి, తేలు భవాని ధర్మ స్వామి, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మద్ది సూర్యకాంత్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నాగర్తి రమేష్ రెడ్డి, దేవాలయ కమిటీ అధ్యక్షుడు రమేష్ రెడ్డి, గ్రామ కార్యదర్శి శ్యామ్, అఖిలపక్ష నాయకులు, ఉపాధ్యాయులు, మహిళలు మరియు విద్యార్థినీ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

 

1 Comment

Leave a reply

Please enter your comment!
Please enter your name here