📄 ePaper
Monday, August 10, 2026
📄 ePaper
Homeసంగారెడ్డిఆమ్ ఆద్మీ పార్టీ సంగారెడ్డి జిల్లా కన్వీనర్‌గా బొంగుల ఉమారాణి

ఆమ్ ఆద్మీ పార్టీ సంగారెడ్డి జిల్లా కన్వీనర్‌గా బొంగుల ఉమారాణి

– సంగారెడ్డి జిల్లా కార్యవర్గం నియామకం

సంగారెడ్డి, జూన్ 30 (నవజ్యోతి ప్రతినిధి) : ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం సంగారెడ్డి జిల్లా కార్యవర్గాన్ని నియమిస్తూ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. రాష్ట్ర కన్వీనర్ హేమా సుదర్శన్ జిల్లోజు విడుదల చేసిన ప్రకటనలో జిల్లా కార్యవర్గ సభ్యుల పేర్లను వెల్లడించారు. జిల్లా కన్వీనర్‌గా ఉమారాణి, సహ కన్వీనర్‌గా ఘౌస్ పాషా, ప్రధాన కార్యదర్శిగా అంజనేయులు, ఖజాంచిగా పద్మ, సంయుక్త కార్యదర్శిగా శోభ నియమితులయ్యారు. అదనంగా జిల్లా ఇన్‌చార్జిగా రాజేశ్వర్, యువజన విభాగం ఇన్‌చార్జిగా విష్ణు, సోషల్ మీడియా విభాగం ఇన్‌చార్జిగా మల్లేష్, జహీరాబాద్ టౌన్ ఇన్‌చార్జిగా మొహమ్మద్ జహీర్ పాషాలను పార్టీ నియమించింది. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన నాయకులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుగా వ్యవహరించాలని రాష్ట్ర నాయకత్వం ఆకాంక్షించింది. నియమితులైన నాయకులకు పార్టీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి సేవలు పార్టీ విస్తరణకు ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ ఉమా రాణి మాట్లాడుతూ ఆమ్ ఆద్మీ పార్టీని సంగారెడ్డి జిల్లాలో గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని జిల్లా కన్వీనర్ ఉమా రాణి తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని, పార్టీ సిద్ధాంతాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లేందుకు కార్యకర్తలతో కలిసి సమిష్టిగా పనిచేస్తామని ఆమె పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!