📄 ePaper
Monday, August 10, 2026
📄 ePaper
Homeసంగారెడ్డిఐజేయూ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఎం.ఏ.కె ఫైసల్‌కు ఘన సన్మానం

ఐజేయూ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఎం.ఏ.కె ఫైసల్‌కు ఘన సన్మానం

సంగారెడ్డి, ఆగస్టు 08, నవజ్యోతి న్యూస్: ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) జాతీయ కార్యవర్గ సమావేశం సందర్భంగా తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐజేయూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.ఏ.కె. ఫైసల్‌ను ఘనంగా సన్మానించారు. బెంగళూరులోని బెంగళూరు గేట్‌ హోటల్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఐజేయూ జాతీయ అధ్యక్షుడు బల్విందర్ సింగ్ జమ్ము, ప్రధాన కార్యదర్శి డి. సోమసుందర్, మాజీ అధ్యక్షుడు ఎస్.ఎన్. సిన్హా, కర్ణాటక స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ అధ్యక్షుడు జానకి మోహన్ తదితరులు ఫైసల్‌ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఐజేయూ జాతీయ కార్యవర్గ సమావేశానికి తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డితో పాటు దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల నుంచి జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు, జాతీయ కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. జర్నలిస్టుల సంక్షేమం, మీడియా స్వేచ్ఛ, జర్నలిస్టుల హక్కులు, వృత్తిపరమైన సమస్యలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!