📄 ePaper
Monday, August 10, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్వేములపల్లి ఆదర్శ పాఠశాలలో స్పాట్ అడ్మిషన్లు ప్రారంభం – ప్రిన్సిపాల్ దీన సుజాత

వేములపల్లి ఆదర్శ పాఠశాలలో స్పాట్ అడ్మిషన్లు ప్రారంభం – ప్రిన్సిపాల్ దీన సుజాత

వేములపల్లి, జూన్ 30 (నవజ్యోతి ప్రతినిధి) మండల కేంద్రంలోని స్థానిక ఆదర్శ పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వరకు స్పాట్ అడ్మిషన్లు కొనసాగుతున్నాయని పాఠశాల ప్రిన్సిపాల్ దీన సుజాత ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశానికి ఆసక్తి ఉన్న విద్యార్థులు తమ సంబంధిత విద్యా ధ్రువపత్రాలతో నేరుగా పాఠశాలకు వచ్చి స్పాట్ అడ్మిషన్ పొందవచ్చని ఆమె పేర్కొన్నారు. 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివే బాలికలకు హాస్టల్ వసతి అందుబాటులో ఉందని తెలిపారు. నాణ్యమైన విద్య, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల బోధన, క్రమశిక్షణతో కూడిన విద్యా వాతావరణం, ప్రభుత్వ సౌకర్యాలతో విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి పాఠశాల కృషి చేస్తోందని వివరించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకుని వెంటనే పాఠశాలలో చేరి తమ భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ప్రిన్సిపాల్ దీన సుజాత విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!